సమీక్ష : భారతీయుడు 2 – కొన్నిచోట్ల మెప్పించే యాక్షన్ ఎంటర్ టైనర్ !

సమీక్ష : భారతీయుడు 2 – కొన్నిచోట్ల మెప్పించే యాక్షన్ ఎంటర్ టైనర్ !

Published on Jul 13, 2024 3:01 AM IST
Bharateeyudu 2 Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 12, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు.

దర్శకులు: ఎస్. శంకర్

నిర్మాత : సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్.

సంగీత దర్శకులు: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

ఎడిట‌ర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) అండ్‌ అతని స్నేహితులు సమాజంలోని అవినీతి పై, అన్యాయాల పై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల నేపథ్యంలో వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్ట్ లు పెడతారు. భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి అలియాస్ భారతీయుడు (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని భారతీయుడు చంపేస్తాడు. అలాగే యువకులను మోటివేట్ చేస్తాడు. భారతీయుడు మాటలు ప్రభావం కారణంగా చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) జీవితంలో చాలా విషాదం జరుగుతుంది. దానికి కారణం భారతీయుడే అంటూ అందరూ నిందిస్తారు. అసలు ఏం జరిగింది ?, ఎందుకు సామాన్య జనం కూడా భారతీయుడు పై కోపం పెంచుకున్నారు ?, ఇంతకీ, భారతీయుడు టార్గెట్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

స‌మ‌కాలీన‌ స‌మాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిన ఈ సినిమాలో భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. సేనాప‌తిగా క‌మ‌ల్‌ హాస‌న్ ఎప్పటిలాగే త‌న యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కమ‌ల్‌ లుక్‌ అండ్ మ్యాన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌న‌పై వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి విజువ‌ల్‌ గా ఈ చిత్రం చాలా గ్రాండియ‌ర్‌గా ఉంది.

చిత్ర అరవిందన్‌ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పైగా సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సకలకళ వల్లవన్ సర్గుణ పాండియన్‌గా SJ సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా ఆకట్టుకున్నాడు. దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. అలాగే, వివేక్, గుల్షన్ గ్రోవర్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్ గా ఉంది. మొత్తానికి భారీ విజువల్స్ తో పాటు గుడ్ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ముఖ్యంగా సమాజంలోని లోటుపాట్లును దర్శకుడు శంకర్ చాలా బాగా చూపించారు. చివర్లో మూడో పార్ట్ కి సంబంధించి రివీల్ చేసిన షాట్స్ కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధ స్వాతంత్ర్య సమరయోధుడి కథ గురించి ఆల్ రెడీ భారతీయుడు చిత్రంలోనే చాలా బాగా చూపించారు. దీంతో ఈ సీక్వెల్ లో ప్లాట్ పరంగా, పాత్రల పరంగా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది. సమకాలీన సంఘటనల ఆధారంగా సీన్స్ రాసుకున్నప్పటికీ, వాటిలో ఎలాంటి కొత్తదనం లేదు. దీంతో స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగాయి.

పైగా దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను బహిర్గతం చేయడానికి చాలా సీన్స్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ అవినీతి గురించి అవగాహన ఉన్నదే కదా. ఆ అవినీతి పై భారతీయుడు ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, ఆ కోణంలో ఈ సినిమా ఎక్కువ సేపు సాగకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది. పైగా క‌మ‌ల్‌ హాస‌న్‌ తో పాటు ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్ట‌ర్ కి కూడా లెంగ్త్ ఎక్కువ‌గా ఉండటం ఫ్యాన్స్ కి రుచించదు. అనిరుధ్ మ్యూజిక్ కూడా గొప్పగా సాగలేదు. మొత్తానికి ఈ సినిమా కొన్నిచోట్ల బోరింగ్ ప్లేతో, అవుట్‌ డేటెడ్ సీన్స్ తో సాగింది .

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

 

తీర్పు :

భారీ అంచనాల మధ్యన వచ్చిన ఈ ‘భారతీయుడు-2’ కమల్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. అలాగే, శంకర్ మార్క్ విజువల్స్, కమల్ హాసన్ నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే, బోరింగ్ ప్లే, అవుట్‌ డేటెడ్ సీన్స్ అండ్ పెద్దగా కథ లేకపోవడం, మరియు కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా కమల్ తన లుక్స్ అండ్ పెర్పార్మెన్స్ తో తన అభిమానులను మాత్రమే అలరించారు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు