లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’ (తెలుగులో భారతీయుడు-2) చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ‘ఇండియన్-2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే.. ఈ సినిమాకు తొలిరోజే నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో దారుణమైన ఫ్లాప్ దిశగా ఈ సినిమా సాగుతుంది.
ఇక ఇప్పటికే చాలా థియేటర్లలో ‘భారతీయుడు-2’ సినిమాను తొలగించేశారు. ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు ఓటిటి పార్ట్నర్ నెట్ ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. తొలుత ఈ సినిమాను రిలీజ్ అయిన రెండు నెలల తరువాతే ఓటిటి స్ట్రీమింగ్ చేసేలా అగ్రీమెంట్ చేసుకున్నారు.
కానీ, సినిమా రిజల్ట్ తో ఇప్పుడు అనుకున్నదానికంటే ముందుగానే ఈ సినిమాను ఓటిటి స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమాను ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నిస్తుందట. మరి ‘భారతీయుడు-2’ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి.