కమల్ మరో లుక్ తో “భారతీయుడు 2” ట్రైలర్ టైం ఫిక్స్


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” కోసం తెలిసిందే. మరి మన తెలుగులో “భారతీయుడు 2” గా రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ ట్రైలర్ ని అయితే ఈరోజు వదులుతున్నట్టుగా ఫిక్స్ చేశారు.

మరి ఇంకా టైం ని రివీల్ చేయలేదు అనుకుంటున్నా సమయంలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ టైం ని ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అయితే ఇప్పుడు రివీల్ చేసేసారు. ఇది వరకు సేనాపతి లుక్ లో మాత్రమే శంకర్ కమల్ ని రివీల్ చేయగా ఇప్పుడు మరో సరికొత్త లుక్ తో ఊహించని పోస్టర్ ని వదిలారు.

ఇందులో నెరిసిన గడ్డం, జుట్టు టోపీ పెట్టుకొని ఉన్న కమల్ కనిపిస్తున్నారు. ఇక ఈ కొత్త పోస్టర్ తో అయితే ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి తెలుగు సహా తమిళ్ హిందీలో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version