భీం టీజర్లో ఊహించని హైలైట్ అంశాలు ఇవేనట.!

Published on Oct 17, 2020 10:06 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న రామరాజు ఫర్ భీం టీజర్ ఇంకొన్ని రోజుల్లో రానుంది. ఇప్పటికే ఈ టీజర్ విషయంలో తారక్ అభిమానిలు పెద్ద పెద్ద ప్లానింగులు చేసేసారు. ముఖ్యంగా రాజమౌళి ఈ టీజర్ ను ఎలా కట్ చేసారు తారక్ ను ఎలా చూపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అల్లూరిగా చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

అలాగే మరో పక్క ఎలివేషన్స్ ను కూడా గట్టిగా దట్టించారని కూడా తెలుసు. కానీ తారక్ లుక్ పరంగా మాత్రం జక్కన ఊహించని విధంగా చెక్కినట్టు ఇపుడు తెలుస్తుంది. ఈ టీజర్ లో భీం గా తారక్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపించే లుక్స్ చాలా అద్భుతంగా స్టన్ చేసే విధంగా ఉంటాయని తెలుస్తుంది.

అలాగే భీం అంటే తలపాగా తప్పని సరి ఆ లుక్ లో కూడా తారక్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా మాత్రం తారక్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఈ టీజర్తో అదరగొట్టడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి రామరాజు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 22 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More