‘భీమ్లా నాయక్’ నుంచి రానా టీజర్ రాబోతుందా?

Published on Sep 15, 2021 1:03 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ సినిమాలో రానాది కూడా మరో హీరో వంటి పాత్ర కావడంతో ఆయన పాత్ర యొక్క స్వరూప స్వభావాలను చూపించేలా ఒక టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయినట్టు తెలుస్తుంది. వచ్చే వారం రానా టీజర్ విడుదల కావచ్చు అని టాక్ వినిపిస్తుంది. రానా టీజర్‌తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :