బుక్ మై షో లో కూడా “భీమ్లా నాయక్” అదిరే రికార్డ్.!

బుక్ మై షో లో కూడా “భీమ్లా నాయక్” అదిరే రికార్డ్.!

Published on Feb 23, 2022 7:02 AM IST

bheemla nayak 2
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “భీమ్లా నాయక్” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ మాస్ సినిమా తాలూకా బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నాయి. మరి ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు కాస్త ఆలస్యంగా పెట్టినా భారీ లెవెల్లో అమ్ముడు పోయాయి.

కానీ ఇది కాకుండా అందులో టాలీవుడ్లో భారీ రికార్డ్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. రీజనల్ గా మన టాలీవుడ్ లో ఏ సినిమాకి కూడా రాని విధంగా 3 లక్షల 75 వేల మందికి పైగా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీనితో ప్రస్తుతానికి మన టాలీవుడ్ లో ఇది భారీ రికార్డు గా నమోదు అయింది. అయితే సినిమా రిలీస్ నాటికి ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరి భీమ్లా నాయక్ ఎక్కడ ఆగుతాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు