రికార్డు మైల్ స్టోన్ అందుకున్న “భీమ్లా నాయక్” సాంగ్.!

Published on May 27, 2022 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాణా దగ్గుబాటి మరో హీరో పాత్రలో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “భీమ్లా నాయక్”. పవన్ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రం భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ లో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఇచ్చిన స్కోర్ గాని పాటలు గాని చాలా కీలక పాత్ర పోషించాయి. పవన్ కెరీర్ లోనే ఒక బెస్ట్ ఆల్బమ్ ని థమన్ అయితే ఈ సినిమాతో అందించాడు.

మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అయితే స్టార్టింగ్ లోనే యూననిమస్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అలాగే ఈ సాంగ్ లో కనిపించిన కిన్నెర మొగులయ్య కి కూడా అపారమైన కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ గా యు ట్యూబ్ లో రికార్డ్ మైల్ స్టోన్ 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :