“భీమా” నాన్ థియేట్రికల్ పార్టనర్స్ ఇవే!

టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఏ. హర్ష రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను నేడు రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం కి సంబందించిన నాన్ థియేట్రికల్ రైట్స్ పై క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన డిజిటల్ హక్కులని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అదే విధంగా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా కొనుగోలు చేయడం జరిగింది. ఈ చిత్రం లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ చిత్రాలకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version