టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “భోళా శంకర్”


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. ఈ చిత్రం 2015 లో రిలీజైన వేదాలం చిత్రానికి అధికారిక రీమేక్. గతేడాది థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం ఓపెనింగ్స్ ను కూడా రాబట్టడంలో విఫలం అయ్యింది. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version