సమీక్ష : ‘బిచ్చగాడు 2’ – అక్కడక్కడ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ‘బిచ్చగాడు 2’ – అక్కడక్కడ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా !

Published on May 20, 2023 3:04 AM IST
Bichagadu 2 Movie Review In Telugu

విడుదల తేదీ : మే 19, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, యోగి బాబు, రాధా రవి, వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్ మరియు దేవ్ గిల్

దర్శకులు : విజయ్ ఆంటోని

నిర్మాతలు: ఫాతిమా విజయ్ ఆంటోని

సంగీత దర్శకులు: విజయ్ ఆంటోని

సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్

ఎడిటర్: విజయ్ ఆంటోని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన సినిమా బిచ్చగాడు 2. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

 

సత్య (విజయ్ ఆంటోనీ) ఒక బిచ్చగాడు. చిన్నప్పుడు తప్పిపోయిన తన చెల్లిని వెతుక్కుంటూ ఉంటాడు. మరోవైపు లక్ష కోట్లకు వారసుడైన అపర కోటీశ్వరుడు విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) పై అతని మనుషులే మర్డర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో విజయ్ గురుమూర్తి ప్లేస్ లోకి సత్య వస్తాడు. బిచ్చగాడు అయిన సత్య అపర కోటీశ్వరుడిగా ప్రజలకు ఏం చేశాడు?, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?, చివరకు అతను తన చెల్లిని కలుసుకున్నాడా? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

విజయ్ ఆంటోని.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి విజయ్ ఆంటోని మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో విజయ్ ఆంటోని చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ మరియు తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది.

యోగి బాబు, రాధా రవి, వైజి మహేంద్రన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్ మరియు దేవ్ గిల్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడిగా కూడా విజయ్ ఆంటోని తీసుకున్న స్టోరీ లైన్, ఆయన రాసుకున్న కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా బాగా ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

సత్య పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు విజయ్ ఆంటోనీ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. అలాగే విజయ్ గురమూర్తి ఆస్తులతో సత్య ప్రజా సేవ చేశాడని సరిపెట్టడం ఎఫెక్టివ్ గా అనిపించదు. అలాగే బ్రెయిన్ సర్జరీ ట్రాక్ కూడా లాజికల్ కరెక్ట్ గా అనిపించదు.

అయితే, తాను రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన విజయ్ ఆంటోనీ, ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు. అలాగే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. దాంతో ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా ఓం నారాయణ్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు విజయ్ ఆంటోని డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగా ఫాతిమా విజయ్ ఆంటోని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

బిచ్చగాడు 2 అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో మెయిన్ కంటెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకున్నాయి. అయితే, స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, సెకండ్ హాఫ్ టెంపో తగ్గడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు