దేశంలో అనేక ప్రధాన భాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కొంచెం లేటుగా మొదలైనప్పటికీ మంచి క్రేజే సంపాదించుకుంది. 2017లో మొదలైన తెలుగు బిగ్ బాస్ షో మొదటి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ షో ని బాగా రక్తికట్టించారు. ఇక గత మూడు సీజన్లో లో పార్టిసిపేట్ చేసిన వారికి మంచి గుర్తింపే దక్కింది. కాగా నాని వ్యాఖ్యాతగా చేసిన సీజన్ 2లో విన్నర్ గా నిలిచిన కౌశల్ తాను ప్రత్యేకం అనిపించుకున్నారు. సింగర్ గీతా మాధురి తో పోటీపడి కౌశల్ ఈ టైటిల్ నెగ్గడం జరిగింది. ఇతను హౌస్ లో ఉన్నప్పుడు బయట ఓ ఆర్మీ ఆయన కోసం పని చేసింది.
బిగ్ బాస్ విన్నర్ గా పాపులారిటీ వచ్చినప్పటికీ కెరీర్ పరంగా కౌశల్ కి అంతగా అవకాశాలు రాలేదు. కాగా ఈ బిగ్ బాస్ విన్నర్ ఇటీవల రాజకీయాల వైపు మరలారు. ఈనెల 28వ తేదీన గురువారం నాడు ఆయన బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.