నిజంగా నాని సినిమా చిక్కుల్లో పడిందా ?

Published on Oct 17, 2020 2:01 am IST


నాచ్యురల్ స్టార్ నాని గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ‘వి’ సినిమాతో పకరించిన ఆయన ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ఆరు నెలల లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూట్ రీస్టార్ట్ అయింది. ఇది పూర్తైన వెంటనే ఆయన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని మొదలుపెట్టాల్సి ఉంది. పేరులోనే వైవిధ్యం ఉట్టిపడుతున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం జగట్లేదని టాక్.

మొదటగా ఈ సినిమా సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా అనౌన్స్ కాబడింది. కానీ ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. వారి స్థానంలో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలు నిజమా, ఒకవేళ నిజమే అయితే సితార ఎంటెర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్ నుండి ఎందుకు వైదొలగింది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More