రజిని వర్సెస్ సూర్య క్లాష్..


ప్రస్తుతం కోలీవుడ్ నుంచి కూడా పలు భారీ సినిమాలు రానున్నాయి. వాటిలో ఆల్రెడీ తలైవర్ రజినీకాంత్ హీరోగా అమితాబ్, రానా లాంటి స్టార్స్ కలయికలో దర్శకుడు టిజి జ్ఞ్యానవేల్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “వెట్టైన్” కూడా ఒకటి. మరి జైలర్ హిట్ తర్వాత రజిని నుంచి వస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇది కాగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాని మేకర్స్ ఆల్రెడీ అక్టోబర్ రిలీజ్ కి ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది అని స్ట్రాంగ్ బజ్ ఉంది. కానీ ఇదే డేట్ లో స్టార్ హీరో సూర్య నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువ” ని లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.

కోలీవుడ్ లో ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇలా రెండు సినిమాలపై కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మరి ఒకే డేట్ లో ఈ రెండు సినిమాలు పడితే భారీ క్లాష్ తప్పదని చెప్పాలి. ప్రస్తుతం అయితే కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక సూర్య సినిమాని దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version