స్టార్ హీరో చేతికి కిరణ్ అబ్బవరం ‘క’ !

స్టార్ హీరో చేతికి కిరణ్ అబ్బవరం ‘క’ !

Published on Sep 9, 2024 12:00 PM IST

కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మలయాళంలో ‘క’ను విడుదల చేయబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. Wayfarer Films పేరుతో దుల్కర్ కు ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ నేపథ్యంలోనే ‘క’ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేసేందుకు దుల్కర్ సల్మాన్ ముందుకు వచ్చాడు.

కాగా ‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం మీద చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు