రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘టాక్సిక్’ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండగా భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ఈ చిత్రంపై అంచనాలను పెంచాయి.
అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ బిగ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. టాక్సిక్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో మార్చి 19, 2026లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఓ కొత్త పోస్టర్‌తో ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. 2026 ఉగాది కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో టాక్సిక్ మూవీపై అంచనాలు అమాంతం మరోసారి పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, అచ్యుత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.