ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి వచ్చింది. అయితే దీనికి ముందు రోజు రాత్రే డిసెంబర్ 4న సంధ్య 70ఎంఎం థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటన ఊహించనిదిగా మారింది.
అయితే ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ సహా నిర్మాతలు రవి శంకర్, నవీన్ లపై కూడా కేసు ఫైల్ అయ్యింది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరు నిర్మాతలు తమపై కేసు కొట్టివేయాలని హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. అయితే తమ తరపు న్యాయవాది థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ న్యాయవాది వాదించారు.
అలాగే ఆరోజున తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని అందుకే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారు, ఆరోజున అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకోని ఘటన జరిగింది. జరిగిన ఘటన కు సినిమా ప్రొడ్యూసర్లు నిందితులుగా చేర్చడం సరికాదని పిటిషనర్ న్యాయవాది తన వాదన వినిపించారు.
దీనితో పుష్ప 2 నిర్మాతలని అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇలా ఎట్టకేలకి పుష్ప 2 నిర్మాతలకి ఈ కీలక అంశంలో ఊరట లభించింది అని చెప్పాలి. అలాగే న్యాయ స్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.