“తుంబాడ్” థియేటర్స్ లో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.!

“తుంబాడ్” థియేటర్స్ లో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.!

Published on Sep 14, 2024 8:03 AM IST

మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు అండర్ రేటెడ్ జెమ్ చిత్రాల్లో మూవీ లవర్స్ నుంచి డెఫినెట్ గా వినిపించే సినిమా పేర్లలో మరాఠీ హారర్ థ్రిల్లర్ చిత్రం “తుంబాడ్” కూడా ఉంటుంది. దర్శకుడు రాహి అనీల్ బార్వే తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అయ్యినపుడు అంత గుర్తింపు రాలేదు కానీ తర్వాత మాత్రం ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అయితే ఈ చిత్రాన్ని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్స్ పై ఇండియా వైడ్ గా రిలీజ్ కి తీసుకురాగా ఈ సినిమా కి ఇప్పుడు ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే బిగ్ స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని చూడటమే ఒక గిఫ్ట్ అయితే మేకర్స్ మరో ఊహించని గిఫ్ట్ ని థియేటర్స్ లో అభిమానులకి అందించారు.

గత కొన్నేళ్లు కితం వినిపించిన సీక్వెల్ వార్తలని అఫీషియల్ గా రివీల్ చేశారు. సినిమా క్లైమాక్స్ తర్వాత హస్తర్ తిరిగి వస్తాడు అంటూ “తుంబాడ్ పార్ట్ 2” ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది మాత్రం థియేటర్స్ లో చాలా మంది ఊహించలేదు. దీనితో పార్ట్ 2 కోసం వారంతా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ ఎప్పటికి వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు