Game Changer: ‘గేమ్ ఛేంజర్’ బిగ్ అప్డేట్.. గెట్ రెడీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీలో రామ్ చరణ్ ఓ ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి ఇకపై వరుస అప్డేట్స్ ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 25న ఉదయం 9.09 గంటలకు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ అనౌన్స్‌మెంట్ రాబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా.. ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version