మరో క్రేజీ పాత్రలో సీనియర్ హీరోయిన్ ?

మరో క్రేజీ పాత్రలో సీనియర్ హీరోయిన్ ?

Published on Sep 22, 2024 9:01 AM IST

విరూపాక్ష సినిమా దర్శకుడు ‘కార్తీక్ దండు’ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. కథకు అనుగుణంగా వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఓ బలమైన లేడీ పాత్రకి స్కోప్ ఉందట. ఈ పాత్రను విజయశాంతి చేత చేయిస్తే బాగుంటుందని, ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది.

మరి చైతు సినిమాలో విజయశాంతి నటిస్తోందో లేదో చూడాలి. విజయశాంతి పాత్ర కథకు చాలా కీలకం అని తెలుస్తుంది. అన్నట్టు ఈ చిత్రంలో చైతు లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి నాగ చైతన్య న్యూ మేకోవర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) నిర్మించబోతుంది. కాగా ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న భారీ చిత్రం “తండేల్”.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు