రజినీకాంత్ “కూలీ” పై బిగ్ అప్డేట్ అందించిన లోకేష్!

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టైయాన్ చిత్రంలో నటించారు. ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తదుపరి రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ లోకేష్ ఈ చిత్రంకు సంబందించిన బిగ్ అప్డేట్ ను అందించారు.

టెస్ట్ లుక్ ను సోషల్ మీడియాల వేదికగా రిలీజ్ చేస్తూ, సినిమా షూటింగ్ జూలై లో స్టార్ట్ కానున్నట్లు వెల్లడించడం జరిగింది. రిలీజ్ చేసిన ఫోటో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version