భారీ అప్ డేట్ కి రెడీ అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’

Published on Aug 12, 2022 5:33 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే లేటెస్ట్ ఇండస్ట్రీ బజ్ ప్రకారం ఈ మూవీ నుండి మరొక రెండు రోజుల్లో ఒక సర్ప్రైజింగ్ అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి సలార్ ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ అప్ డేట్ దానికి సంబంధించింది అయితే సూపర్ అంటున్నారు విశ్లేషకులు. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్న సలార్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :