“బిగ్ బాస్ 4” టీం ప్లాన్ వర్కౌట్ అయ్యిందే..!

Published on Sep 24, 2020 5:28 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ మొత్తం మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగో సీజన్లోకి అడుగు పెట్టింది. అయితే గత సీజన్ ను అత్యద్భుతంగా రక్తి కట్టించిన స్మాల్ స్క్రీన్ కింగ్ నాగార్జున మళ్ళీ ఈసారి కూడా హోస్ట్ గా చేయడంతో మొట్ట మొదటి గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ కు రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

అయితే ఇక ఆ తర్వాత నుంచి గ్రౌండ్ టాక్ ప్రకారం షో ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదని నెటిజన్స్ మరియు ఈ షో ఫాలోవర్స్ పెదవి విరిచేసారు. దీనితో బిగ్ బాస్ టీం కు పెద్ద షాక్ లా తగిలింది. దీనితో వర్రు ముందుగానే వైల్డ్ కార్డు ఎంట్రీలు దింపేశారు. దీనితో అక్కడ నుంచి షో రేటింగ్ బాగానే వస్తుంది అని తెలుస్తుంది. శని, ఆదివారల వీకెండ్ డేస్ ను మినహాయిస్తే వీక్ డేస్ లో యావరేజ్ గా ఈ షోకు 8 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వస్తున్నాయట. దీనితో బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More