మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై మంచి ఫేమస్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ ని స్టార్ట్ చేసుకొని విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సారి సీజన్లో లో కూడా పలువురు ప్రముఖ వ్యక్తులే కంటెస్టెంట్స్ గా కనిపించగా వారిలో మల్టీ టాలెంటెడ్ అయినటువంటి నేహా చౌదరి కూడా ఒకరు.
మరి నేహా అయితే లేటెస్ట్ గా తాను తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్లో తన పెళ్లి గాసిప్స్ పై స్పందిస్తూ అందరికీ ఓ క్లారిటీ ఇస్తానని, తన ఫ్రెండ్స్ ని పిలిపించుకొని చాలా సేపు ముచ్చట్ల తర్వాత ఆమె రివీల్ చేసింది. ఆమె తన చిన్న నాటి ఫ్రెండ్ అనీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వెల్లడి చేసింది.
ఒకరికి ఒకరంటే చాలా ఇష్టమని తనైతే నన్ను వదిలి ఉండలేడని ఎంత బిజీ అయినా కూడా నాకు కాల్ చేసి మాట్లాడుతాడని ఇంకా వంట బాగా చేస్తాడని ఎన్నో వారి మధ్య బ్యూటిఫుల్ విషయాలు పంచుకుంది. ఇలా దీనితో అయితే నేహా తన పెళ్లి రూమర్స్ కి ఒక గుడ్ ఎండింగ్ ఇచ్చింది అని చెప్పాలి.