బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రీమియర్ కి రెడీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రీమియర్ కి రెడీ!

Published on Aug 19, 2022 7:56 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రేక్షకులని, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు రియాలిటీ షో, ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మాలో ప్రీమియర్ కానుంది. నాగార్జున అక్కినేని మరో సారి ఈ షోను హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా ప్రీమియర్ కానుంది.

ఈరోజు, OTT ప్లాట్‌ఫారమ్ కొత్త ప్రోమోతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రీమియర్ తేదీని ప్రకటించింది. ప్రదర్శన సెప్టెంబర్ 4, 2022 నుండి ప్రారంభమవుతుంది అని వెల్లడించడం జరిగింది. చాలా మంది టీవీ మరియు చలనచిత్ర ప్రముఖులు ఇప్పటికే షో కోసం ఖరారు కాగా, ఇది మునుపటి సీజన్ల కంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది అని తెలుస్తోంది. మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం ఈ స్పేస్‌ని చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు