బిగ్ బాస్ సెన్సేషన్ అభిజీత్ “మేజర్” పై ఇంట్రెస్టింగ్ రివ్యూ.!


మన తెలుగు బుల్లి తెర దగ్గర బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ షో ద్వారా అప్పటి వరకు ఉన్న ఫేమ్ వేరు ఆ తర్వాత నమోదు అయ్యిన ఫేమ్ వేరేగా పలువురు నటులకు వచ్చింది. అయితే ఇన్ని సీజన్లలో కూడా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన సెన్సేషనల్ యంగ్ కంటెస్టెంట్ అభిజీత్ కోసం అయితే షో వీక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆ రేంజ్ లో క్రేజ్ ని తాను సొంతం చేసుకున్నాడు. అయితే తర్వాత సోషల్ మీడియాలో కూడా కాస్త తక్కువే కనిపించిన అభిజీత్ లేటెస్ట్ గా యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఎమోషనల్ బయోపిక్ “మేజర్” పై తన ఇంట్రెస్టింగ్ రివ్యూ ని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డైరెక్టర్ శశికిరణ్ తిక్క అలాగే మేజర్ సినిమా వెనుక ఉన్న టీం అందరికీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ రియల్ లైఫ్ ఇంత అద్భుతంగా చూపించినందుకు పెద్ద అప్లాజ్ అందిస్తున్నానని అలాగే ఈ సినిమాలో శేష్ పెర్ఫామెన్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయని తెలిపాడు. దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Exit mobile version