ఒక్క హిందీ వెర్షన్ లోనే “కంగువా” భారీ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మేకర్స్ రజినీకాంత్ కి గౌరవం ఇచ్చి తమ సినిమాని దసరా రేస్ నుండి తప్పించేసరికి కొత్త డేట్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం విషయంలో ఇప్పుడో ఆసక్తికరమైన అప్డేట్ తెలుస్తోంది. దీనితో ఈ చిత్రం ఒక్క హిందీ వెర్షన్ లోనే రికార్డ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం హిందీ వెర్షన్ లోనే కంగువా ని ఏకంగా 3000 స్క్రీన్స్ కి విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారట. దీనితో ఇక వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో ఈ సినిమా ఏ రేంజ్ రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version