స్టార్ హీరో మూవీ బడ్జెట్ 125 కోట్లు అనుకుంటే 180 కోట్లు ఐయ్యిందట

స్టార్ హీరో మూవీ బడ్జెట్ 125 కోట్లు అనుకుంటే 180 కోట్లు ఐయ్యిందట

Published on Oct 18, 2019 10:02 AM IST

సౌత్ ఇండియా చిత్రాల మార్కెట్ పరిధి పెరిగిన నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు భారీ బడ్జెట్ తో నిర్మించడానికి నిర్మాతలు వెనకాడడం లేదు. ఒకప్పుడు 30-50 కోట్లకు మించని స్టార్ హీరోల బడ్జెట్ 100కోట్లకు మించి పోయింది. కాగా తమిళ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న తలపతి విజయ్ బిగిల్ మూవీ కోసం ఏకంగా 180కోట్ల బడ్జెట్ కేటాయించారట. మొదట బిగిల్ బడ్జెట్ 125 కోట్లుగా నిర్ణయించగా నిర్మాణం మొదలైన తరువాత అది ఏకంగా 180కోట్లకు చేరిందని సమాచారం.

షూటింగ్ డేట్స్ విషయంలో కూడా విజయ్ మొదట 70రోజులు ఇవ్వగా అది మూవీ పూర్తయ్యేనాటికి 100రోజులకు చేరిందని సమాచారం. మూడు భిన్న వయసులలో విభిన్నమైన పాత్రలు చేస్తున్న విజయ్ ఈ చిత్రం కొరకు బాగానే కష్టపడ్డారు. అట్లీ అడిగినవన్నీ ఇచ్చి రిచ్ గా బిగిల్ నిర్మించిన నిర్మాతలు లాభ పడాలంటే ఈ మూవీ భారీ విజయం అందుకోవాలి. తెలుగు తమిళ భాషల్లో దీపావళి కానుకగా విడుదల అవవుతున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు