విజయ్ ‘బిగిల్’ బాహుబలి2 కంటే కూడా సుదీర్ఘంగా….!

విజయ్ ‘బిగిల్’ బాహుబలి2 కంటే కూడా సుదీర్ఘంగా….!

Published on Oct 17, 2019 12:05 AM IST

తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ బిగిల్ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచనాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే 2మిలియన్ లైక్స్ సాధించిన ఈ మూవీ ట్రైలర్ అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన మూవీగా నిలిచింది. గతంలో షారుక్ నటించిన జీరో మూవీ పేరిట ఉన్న రికార్డు ని చెరిపివేసింది. అసలు బిగిల్ మూవీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో బిగిల్ ట్రైలర్ నమోదు చేస్తున్న రికార్డులు చూస్తుంటే అర్థం అవుతుంది. దీపావళి కానుకగా విడుదల కానున్న బిగిల్ మూవీ నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.

సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఐతే బిగిల్ మూవీ నిడివి చూస్తే 179 నిమిషాలుగా ఉంది. అంటే దాదాపు మూడు గంటలన్న మాట.విజయ్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తున్న నేపథ్యంలో ఓ బలమైన కథను దర్శకుడు అట్లీ సుదీర్ఘంగా చెప్పాడనిపిస్తుంది.రాజమౌళి తీసిన బాహుబలి 2 మూవీ నిడివి కూడా 171 నిమిషాలే కావడం గమనార్హం. తెలుగులో విజిల్ గా రానున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా, నయనతార హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు