యుఎస్ఏ లో దూసుకెళ్తున్న ‘బింబిసార’ ..!

Published on Aug 12, 2022 12:00 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ఇటీవల విడుదలై ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఎంతో భారీగా నిర్మించగా క్యాథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు.భరత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తణికెళ్లభరణి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ, వివన్ భటేనా ఇందులో ఇతర పాత్రలు చేసారు.

ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ మూవీలో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా అత్యద్భుతంగా నటించిన హీరో కళ్యాణ్ రామ్ కి, అలానే మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వశిష్ట కి అందరి నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి. కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యుఎస్ఏ లో కూడా మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న బింబిసార మూవీ ఇప్పటివరకు మొత్తం 450కె డాలర్స్ ని కొల్లగొట్టింది. కాగా రెండవ వారం నుండి ఈ మూవీకి అక్కడ మరిన్ని ప్రాంతాల్లో షోలు యాడ్ చేస్తుండడం విశేషం.

సంబంధిత సమాచారం :