వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బింబిసార…ఎప్పుడంటే?


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగామల్లిడి వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ బింబిసార. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. అంతేకాక కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి వసూళ్లను సాధించిన చిత్రం గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. ఈ చిత్రం జీ తెలుగు లో జనవరి 8 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

సంయుక్త మీనన్, కేథరిన్ థెరిస్సా, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా,ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని హారి కృష్ణ కే నిర్మించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version