Devara first Review: బ్లాక్ బస్టర్ “దేవర”.. ఫస్ట్ రివ్యూ వైరల్

Devara first Review: బ్లాక్ బస్టర్ “దేవర”.. ఫస్ట్ రివ్యూ వైరల్

Published on Sep 22, 2024 6:48 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొనగా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎన్టీఆర్ 30 సినిమాగా కొరటాల శివతో రెండో సినిమాగా చేయగా అభిమానుల్లో ఓ రేంజ్ హైప్ దీనిపై నెలకొంది.

అయితే ఈ చిత్రం విషయంలో ఇప్పుడు సంగీత దర్శకుడు అనిరుద్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తారక్ తో కలిపి ఒక పిక్ ని షేర్ చేసిన అనిరుద్ తన సినిమాపై నమ్మకంగా ఉంటే పెట్టే పోస్ట్ పలు ఎమోజిస్ తో పెట్టేలా దేవర కి కూడా పెట్టాడు.

దీనితో దేవర బ్లాక్ బస్టర్ అయ్యిపోయినట్టే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. గతంలో అనిరుద్ జైలర్, జవాన్ లాంటి సినిమాలకి కూడా పెట్టగా అవి భారీ హిట్ అయ్యాయి. దీనితో దేవరకి మళ్ళీ పెట్టడంతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక మిగతా అంతా ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు