‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Published on Dec 27, 2024 5:59 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సె్స్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తు్న్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సాంగ్ రాబోతుంది.

‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే ఎలక్ట్రిఫయింగ్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఓ వీడియో ద్వారా మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు. ఇక ఇప్పుడు ఈ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు