విడుదల తేదీ : జూలై 26, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
నటీనటులు: అవికా గోర్, వర్ధాన్ పూరి, జెనిఫర్ పిసినాటో, రాహుల్ దేవ్ తదితరులు
దర్శకులు: విక్రమ్ భట్
నిర్మాత : రాకేష్ జునేజా
సంగీత దర్శకులు: సమీర్ టాండన్, ప్రతీక్ వాలియా
సినిమాటోగ్రఫీ: నరేన్ గెడియా
ఎడిటర్ : కుల్దీప్ మెహన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
అవికా గోర్ నటించిన లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ మూవీ బ్లడీ ఇష్క్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఓ ప్రమాదం తర్వాత గతం మర్చిపోయిన నేహా(అవికా గోర్)ను ఆమె భర్త రోమేష్(వర్ధన్ పూరి) స్కాట్ లాండ్ లోని ఓ లగ్జరీ ఎస్టేట్ కు తీసుకొస్తాడు. అయితే, అందులో నేహాకు కొన్ని భయానక అనుభవాలు ఎదురవుతుండటంతో, ఆ ఎస్టేట్ లో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంది. కానీ అలాంటిదేమీ లేదని ఆమె భర్త రోమేష్ చెబుతాడు. కానీ నేహా అనుమానం పెరుగుతుండటంతో రోమేష్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుకుంటుంది. ఈ కథలో అయెషా(జెన్నిఫర్ పిసినాటో) ఎవరు..? ఆమెకు నేహా, రోమేష్ లతో సంబంధం ఏమిటి..? నేహా నిజంగానే గతాన్ని మర్చిపోయిందా..? ఆ ఎస్టేట్ లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా.. లేక ఇది ఎవరైనా కావాలనే చేస్తున్నారా..? అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
హార్రర్ చిత్రాలపై అవికా గోర్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందా అనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. బ్లడీ ఇష్క్ సినిమాలో ఆమె డీసెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది.
వర్ధన్ పూరి తన పాత్రలో చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా అవికా గోర్ తో ఆయన చేసిన సీన్స్ బాగున్నాయి. ఆమెకు భయం పోగొట్టే సీన్స్ లో అతడి యాక్టింగ్ బాగుంది.
జెన్నిఫర్ పిసినాటో నటించిన పాత్ర నిడివి చిన్నదే అయినా, కథలో చాలా ముఖ్యమైనది. ఆమె ఈ పాత్రలో మంచి ప్రదర్శన ఇచ్చింది. రాహుల్ దేవ్ కేమియో పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్:
హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు కథ కంటే కూడా ఎంచుకునే ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. హార్రర్ మూవీ అంటే ప్రేక్షకుల్లో భయం, టెన్షన్ క్రియేట్ చేయాలి. ఈ సినిమాలో విక్రమ్ భట్ ఆ అంశాన్ని ఎంచుకోవడంలో పెయిల్ అయ్యారు.
పేలవమైన స్క్రీన్ ప్లే, సిజిఐ వర్క్స్ ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి. ప్రేక్షకులను ఏమాత్రం భయపెట్టలేకపోయిన ఈ సినిమా క్లైమాక్స్ కూడా మైనస్ అని చెప్పాలి.
ఆకట్టుకునే కథనం లోపించడం, సాగదీసే సీన్లు ప్రేక్షకుల్లో ఏమాత్రం థ్రిల్స్ ను క్రియేట్ చేయలేకపోతాయి. ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోతారు.
ఈ సినిమా కథను ముందే ఊహించగలడంతో ఈ మూవీ రన్ టైమ్ 2.15 గంటలు చాలా బోరింగ్ గా సాగుతుంది. అతి కష్టం మీద ఆడియెన్స్ అంతేసేపు సినిమాను చూస్తారు.
అవికా గోర్ తనలోని ట్యాలెంట్ ను పూర్తిగా చూపెట్టాలంటే హార్రర్ థ్రిల్లర్ జోనర్ కాకుండా ఇతర జోనర్లు ఎంచుకుని, మంచి పాత్రలు చేస్తే బాగుంటుంది.
సాంకేతిక విభాగం:
విక్రమ్ భట్ స్థాయి సినిమా అయితే ఇది ఖచ్చితంగా కాదనే చెప్పాలి. మహేష్ భట్, సూహ్రిత దాస్ ల స్క్రిప్ట్ చాలా బలహీనమైనదిగా నిలిచింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటిటిలో ఎందుకు రిలీజ్ చేశారో ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, గ్రాఫిక్స్ ఇలా ఏ ఒక్క అంశం కూడా సినిమాకు కలిసిరాలేదు. శ్వేతా బొత్ర డైలాగులు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
తీర్పు:
ఓవరాల్ గా బ్లడీ ఇష్క్ సినిమా హార్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి నిరాశను మిగిలిస్తుంది. ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు, భయపెట్టే సీన్స్ పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నటీనటుల పర్ఫార్మెన్స్ ఓకే అయినా పేలవమైన టెక్నికల్ పనితనం ఈ సినిమాను చూసేందుకు ఏమాత్రం హెల్ప్ కావు. ప్యూర్ హార్రర్ థ్రిల్లర్ మూవీ కోసం వెతికే వారు ఈ సినిమాను స్కిప్ చేయవచ్చు.
123telugu.com Rating: 1.75/5
Reviewed by 123telugu Team