విజయ్ 69లో బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల తన కెరీర్‌లోని 68వ చిత్రంగా ‘ది గోట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సాధించింది. ఇక ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించడంతో ఆయన తన చివరి సినిమాను ముగించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలిపాడు. దీంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకంటే ముందు రాబోయే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే విజయ్ కెరీర్‌లో 69వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోత్ డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని వారు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే బాబీ డియోల్ వరుసగా సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ 69వ సినిమాలో బాబీ డియోల్ నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర లా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నాడు.

Exit mobile version