డూప్ లేకుండా బాలయ్య స్టంట్స్.. ఫిదా అయిన బాబీ!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.

అయితే, ఈ సినిమా కోసం బాలయ్య డెడికేషన్ చూసిన దర్శకుడు బాబీ ఆయనకు క్రాఫ్ట్స్‌పై ఉన్న మక్కువకు ఫిదా అయిపోయినట్లు తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాబీ వెల్లడించాడు. బాలయ్య ఎమోషనల్ సీన్స్‌లో పండించిన ఎమోషన్.. యాక్షన్ సీన్స్ కోసం ఎలాంటి డూప్ లేకుండా చేసిన స్టంట్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని బాబీ ధీమా వ్యక్తం చేశాడు.

ఇలాంటి యాక్టర్స్ చాలా అరుదుగా ఉంటారని.. అందులోనూ బాలయ్య లాంటి పర్ఫార్మర్‌ను తాను ఇప్పటివరకు చూడలేదని.. బాలయ్య నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని బాబీ చెప్పుకొచ్చాడు. ఇక ‘డాకు మహారాజ్’ మూవీలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version