సౌత్ డైరెక్టర్ పై బోల్డ్ బ్యూటీ విమర్శలు !

సౌత్ డైరెక్టర్ పై బోల్డ్ బ్యూటీ విమర్శలు !

Published on Oct 14, 2024 7:03 AM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ‘మల్లికా షెరావత్’ ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. హిందీతో పాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ మల్లికా షెరావత్ నటించి మెప్పించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ తోనూ మల్లికా షెరావత్ సందడి చేసింది. అయితే, 2012లో సినిమా ఇండస్ట్రీ నుంచి మల్లికా షెరావత్ హఠాత్తుగా కనుమరుగైంది. లేటెస్ట్ గా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాతో మళ్లీ వెండితెర పైకి వచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా ప్రమోషన్‌ కు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది మల్లికా షెరావత్.

కాగా తాజాగా సౌత్ ఇండియన్ మూవీ డైరెక్టర్స్ గురించి మల్లికా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, మల్లికా షెరావత్ ఏం మాట్లాడారు అంటే.. ‘ఒక సౌత్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి హాట్‌ ఐటెం సాంగ్ ఉందని, చేయాలని అడిగారు. ఇది ఎలా ఉండాలంటే చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌ అనేది అర్థమవ్వాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను ఓకే చెప్పాను. ఇంతకీ, నన్ను ఎలా చూపిస్తున్నారు అని అడిగితే… మీ నడుము మీద చపాతీలు వేడి చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకి నేను ఆశ్చర్యపోయి ఆ పాట వెంటనే చేయను అని చెప్పేశాను’ అని మల్లికా షెరావత్ చెప్పింది. ఇంతకీ, ఆ సౌత్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు