కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే. కన్నడలో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు. దగ్గరదగ్గర 90 శాతం షూటింగ్ ముగిసింది. ఇందులో అన్ని పరిశ్రమల నుండి స్టార్ నటీనటుల్ని తీసుకున్నారు.
ఇప్పటికే హిందీ నుండి సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా మరొక హిందీ నటి రవీనా టాండన్ ఒక పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. ఇందులో ఆమె రాఖీ భాయ్ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె షూటింగ్లో జాయిన్ అయ్యారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో చిత్రం విడుదలకానుంది. మొదటి పార్ట్ విపరీతంగా అలరించడంతో యాక్షన్ ప్రియులంతా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.