బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన భారీ హిట్ చిత్రాల్లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రికార్డ్ వసూళ్లతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా అది కూడా భారీ మార్జిన్ తో షారుఖ్ ఖాన్ లాంటి హీరో సినిమాని కొడుతుంది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. మరి అలా చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రమే “స్త్రీ 2”. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ మెయిన్ లీడ్ లో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో భారీ వసూళ్లు అందుకోగా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది.
నేటి నుంచి ఈ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. కానీ ఇందులో ఈ సినిమా ఫ్రీ గా కాకుండా రెంటల్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రస్తుతానికి 349 రూపాయలు ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూసేందుకు చెల్లించి వీక్షించవచ్చు. లేదా ఇంకొన్ని రోజులు ఆగితే ఇదే ప్రైమ్ వీడియోలో ఫ్రీ వెర్షన్ ని సబ్ స్క్రైబర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తుంది.