పుష్పరాజ్ దెబ్బకి బాలీవుడ్ వెనకడుగు వేసిందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, బన్నీ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమాకు పోటీగా తమ సినిమా రాకుండా చాలా మంది మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. పుష్పరాజ్ మేనియా ముందు తమ సినిమా కొట్టుకుపోతే ఫలితం ఉండదని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఛావా’ ప్రమోషన్స్‌లో ఏమాత్రం దూసుకెళ్లడం లేదు. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేయాలని ఆ చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.

అయితే, పుష్ప-2 చిత్రానికి నార్త్‌లో నెలకొన్న క్రేజ్ దృశ్ట్యా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారనే టాక్ బి-టౌన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి నిజంగానే ‘పుష్ప-2’ మూవీ కారణంగా బాలీవుడ్ మూవీ ‘ఛావా’ వాయిదా పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version