గత ఏడాదిలోనే ఎన్నడూ లేని విధంగా ఇండియన్ సినిమా వద్ద పలువురు లెజెండరీ సినీ తారల మరణ వార్తలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. మరి ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన మరో వెటరన్ అండ్ లెజెండరీ నటి శశికళ ఓం ప్రకాష్ కన్ను మూసినట్టుగా బాలీవుడ్ వర్గాల్లో విషయం బయటకు వచ్చింది.
1950ల నుంచి 2004 వరకు ఎన్నెన్నో చిత్రాల్లో నటించి అలాగే స్మాల్ స్క్రీన్ పై కూడా పలు షోలు చేసిన ఈమె తన 88వ ఏట ముంబైలో తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర అంశం ఏమిటంటే ఇంతకు ఆమె మరణానికి సంబంధించి కారణం ఏమిటి అన్నది ఇంకా తెలియరాలేదు.
వయసుకు సంబంధించిన సమస్యలా లేక వేరే ఇతర కారణాలు మూలానా అన్నది ఇంకా క్లారిటీ లేదని తెలుస్తుంది. దీనితో ఈ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రేక్షకులు మరియు పెద్దలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి వారి ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మరి మా 123తెలుగు టీం కూడా శశికళ గారి కుటంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.