మోక్షజ్ఞ సినిమాలో సీనియర్ హీరో ?

మోక్షజ్ఞ సినిమాలో సీనియర్ హీరో ?

Published on Aug 19, 2024 8:00 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని టాక్. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. కాగా ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో మరో బాలీవుడ్ సీనియర్ హీరోని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మోక్షజ్ఞ పాత్రకి గురువు పాత్రలో ఆ సీనియర్ హీరో పాత్ర ఉంటుందట. మరి ఏ సీనియర్ స్టార్ హీరోని మోక్షజ్ఞ సినిమా కోసం పట్టుకొస్తారో చూడాలి. ఇప్పటికే, ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి ‘దివంగత శ్రీదేవి’ చిన్న కూతురు ఖుషీ క‌పూర్ నటిస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటాడని బలంగా వినిపిస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే నందమూరి ఫ్యాన్స్ కి సర్ ప్రైజే. నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు