బాలీవుడ్ ని ఏలేస్తున్న సౌత్ దర్శకులు

బాలీవుడ్ ని ఏలేస్తున్న సౌత్ దర్శకులు

Published on Oct 18, 2019 5:00 PM IST

కొన్నేళ్లుగా సౌత్ ఇండియా ముఖ చిత్రం మారిపోయింది. సౌత్ ఇండియా లోని చిత్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం దక్కించుకుంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న బాలీవుడ్ అధిపత్యానికి గండికొడుతూ బలమైన పోటీదారుగా ఎదిగాయి. సౌత్ చిత్రాలు నార్త్ ఇండియా ప్రేక్షకులకు విపరీతముగా నచ్చేస్తున్నాయి. దీనితో సౌత్ చిత్రాలు అక్కడ విరివిగా రీమేక్ అవుతున్నాయి.బాలీవుడ్ సూపర్ స్టార్స్ సౌత్ చిత్రాలను రీమేక్ చేయడానికి మక్కువ చూపుతున్నారు. అలాగే సౌత్ ఇండియా దర్శకులను తమ చిత్రాలకు డైరెక్టర్స్ గా ఎంపిక చేసుకుంటున్నారు.

మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా,హిందీలో ఆ చిత్రాన్నిషాహిద్ తో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ క్రేజ్ తో మరో చిత్రం కూడా హిందీలో చేయడానికి సైన్ చేశారు. అవార్డు విన్నింగ్ మూవీ ప్రస్థానం చిత్రాన్ని దేవా కట్టా హిందీలో అదే టైటిల్ తో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇక రాఘవ లారెన్స్ అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ అయిన లక్ష్మీ బాంబ్ చేస్తుండగా, అమిర్ ఖాన్ తో విక్రమ్ వేధా చిత్రాన్ని దర్శక దంపతులు పుష్పర్- గాయత్రీలు తెరకెక్కించనున్నారు. ఎప్పటినుండో హిందీలో డైరెక్టర్ గా సెటిల్ అయిన ప్రభుదేవా సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3 ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక దర్శకుడు అట్లీ కూడా షారుక్ తో ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. ఇలా సౌత్ దర్శకులు హిందీ చిత్ర సీమలో సౌత్ జండా ఎగరేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు