బాలీవుడ్ మాజీ స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా(70) మృతి చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు హుటా హుటిన హాస్పిటల్ కి చేరుకున్నారు. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న వినోద్ ఖన్నా 1968 లో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తనదైన నటనతో మెప్పించి హీరోగా కూడా సక్సెస్ అయ్యారు. దాదాపు 141 సినిమాల్లో నటించిన విజయ్ ఖన్నా హఠాన్మరణం చెందడంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 1946 అక్టోబర్ 6న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో వినోద్‌ఖన్నా జన్మించారు. 1971లో గీతాంజలిని వినోద్‌ఖన్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు.
బాలీవుడ్ నటుడు,మాజీ హీరో వినోద్ ఖన్నా మృతి
బాలీవుడ్ నటుడు,మాజీ హీరో వినోద్ ఖన్నా మృతి
Published on Apr 27, 2017 1:28 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “లక్కీ భాస్కర్” – పైసా వసూల్ ఎంటర్టైనర్
- సమీక్ష : క – ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!
- సమీక్ష : అమరన్ – ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామా !
- పవన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్..?
- అఫీషియల్: లోకి యూనివర్స్ లోకి లారెన్స్..?
- అక్కినేని హీరోతో జాన్వీ.. సెట్ అయ్యేనా..?
- సమీక్ష: “బఘీర” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ డ్రామా
- ‘పుష్ప-2’ని పక్కకు పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఏమిటో తెలుసా?