‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బొమ్మాలి రవి సింహ గర్జన !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బొమ్మాలి రవి సింహ గర్జన !

Published on Feb 12, 2019 8:00 AM IST


రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం ఆర్జీవీ సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి సంబంధించిన కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసిన ఆర్జీవీ, మొత్తానికి సినిమా పై బాగానే అంచనాలు పెంచాడు.

కాగా తాజాగా సింహ గర్జన అనే సాంగ్ ను డబ్బింగ్ ఆర్టిస్ట్ బొమ్మాలి రవి చేత పాడించి.. ఆ పాడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మార్చిలో విడుదల చేయబోతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు