Bommarillu: రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న ‘బొమ్మరిల్లు’..!

Bommarillu: రీ-రిలీజ్‌లోనూ ట్రెండ్ అవుతున్న ‘బొమ్మరిల్లు’..!

Published on Sep 20, 2024 2:14 AM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల జోరు కొనసాగుతోంది. తమ అభిమాన హీరోల సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఈ రీ-రిలీజ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతుండటంతో ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది.

ఇక ఇప్పుడు ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బొమ్మరిల్లు’ సెప్టెంబర్ 21న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఈ సినిమా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో బొమ్మరిల్లు ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమా టికెట్లు బుకింగ్ ఓపెన్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తిని చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి రీ-రిలీజ్‌తో ఈ ‘బొమ్మరిల్లు’ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు