జాన్వీ కపూర్ సౌత్ మూవీ ఎంట్రీ పై బోనీ కపూర్ క్లారిటీ

జాన్వీ కపూర్ సౌత్ మూవీ ఎంట్రీ పై బోనీ కపూర్ క్లారిటీ

Published on Feb 4, 2023 2:51 AM IST


దిగ్గజ కథానాయికగా తెలుగుతో పాటు పలు భారతీయ భాషల ఆడియన్స్ మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత నటి శ్రీదేవి. అయితే ఆమె మరణాంతరం ధఢక్ మూవీ ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత నుండి ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లతో పాటు నటిగా ఆడియన్స్ నుండి బాగా పేరుతో కొనసాగుతున్నారు జాన్వీ.

ఇక ఇటీవల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మిలి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం అందుకున్న జాన్వీ అతి త్వరలో ఒక భారీ తమిళ స్టార్ హీరో సినిమాలో నటించనున్నారు అంటూ మూడు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలపై లేటెస్ట్ గా ఒక మీడియా ఛానెల్ వారితో ఆమె తండ్రి బోనీ కపూర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా జాన్వీ ఏ తమిళ మూవీలో నటించడం లేదని, అయితే ఒకవేళ అటువంటి ఆఫర్ తనకు వస్తే తప్పకుండా తామే అధికారికంగా దానిని వెల్లడిస్తాం అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు