సమీక్ష : “బూట్ కట్ బాలరాజు” – నిరాశ పరిచిన బాలరాజు!

Boot Cut Balaraju Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సోహైల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు

దర్శకుడు : కోనేటి శ్రీను

నిర్మాత: ఎండీ పాషా

సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటింగ్: వినయ్ రామస్వామి వి

సంబంధిత లింక్స్: ట్రైలర్

‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. ఐతే, కోనేటి శ్రీను దర్శకత్వంలో మేఘలేఖ హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బూట్ కట్ బాలరాజు’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

సోహెల్ (బూట్ కట్ బాలరాజు) ఊర్లో పనికిమాలిన వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. అయితే, పటేలమ్మా (ఇంద్ర‌జ‌) ఆ ఊరికి అమ్మలా అన్ని విధాలా మంచి చేస్తూ ఉంటుంది. ప్రజలందరికీ కూడా పటేలమ్మా అంటే ఎంతో గౌరవం. మరోవైపు పటేలమ్మా కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బూట్ కట్ బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బూట్ కట్ బాలరాజును సిరి (సిరి హన్మంతు) ప్రేమించడం, దాంతో బాలరాజు తనకు దక్కడు అనే భయంతో మహాలక్ష్మి తన ప్రేమ గురించి బాలరాజు చెప్పడంతో ప్రేమ మొదలు అవుతుంది. మరి బాలరాజు – మహాలక్ష్మి ప్రేమ కథకి ఉన్న సమస్య ఏమిటి ?, అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్ గా పోటీ చేస్తాడు ?, ఇంతకీ పటేలమ్మా పై సర్పంచ్ గా బాలరాజు గెలిచాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన సోహెల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లోసోహెల్ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన మేఘలేఖ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. అలాగే మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది.

ప్రేమించిన అమ్మాయి కోసం స‌య్య‌ద్ సోహైల్ పడిన తపన, అలాగే సర్పంచ్ గా గెలిచే క్రమంలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన సునీల్, ఇంద్రజ, జబర్దస్త్‌ రోహిణి వంటి నటీనటులు కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదే విధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రల్లో అలరించారు.

మైనస్ పాయింట్స్ :

కోనేటి శ్రీను తీసుకున్న కథాంశం, మరియు సోహెల్ – ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సిల్లీగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు కోనేటి శ్రీను ఊరు చూట్టే రిపీట్ డ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడిపాడు.

అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా రాసుకుని ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది.

హీరో పాత్ర తీరులోనూ బలం లేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో కథాకథనాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. కోనేటి శ్రీను రచయితగా విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా అతను అసలు ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత ఎండీ పాషా పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘బూట్ కట్ బాలరాజు’ అంటూ వచ్చిన ఈ లవ్ డ్రామా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం మరియు బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని కామెడీ సీన్స్, నటీనటుల పనితీరు మాత్రం పర్వాలేదు. ఓవరాల్ గా ఈ సినిమా మెప్పించదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version