బాస్ ర్యాంపేజ్..”గాడ్ ఫాథర్” కి 2వ రోజు స్ట్రాంగ్ వసూళ్లు.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం తెలిసిందే. దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం ఒరిజినల్ గా లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది. మరి అనుకున్నట్టుగానే అంచనాలు అందుకొని అయితే ఈ చిత్రం మంచి టాక్ ని సంతరించుకుంది. అయితే గట్టి పోటీలో మరీ భారీ స్థాయి ఓపెనింగ్స్ ఈ సినిమాకి రాలేదు కానీ రెండో రోజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాస్ తన ర్యాంపేజ్ చూపించారు.

మొదటి రోజు వరల్డ్ వైడ్ 38 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు చాలా చిన్నపాటి డ్రాప్ తో 31 కోట్ల సాలిడ్ గ్రాస్ ని అయితే అందుకుంది. ట్రేడ్ వర్గాలు అయితే గాడ్ ఫాథర్ రెండో రోజు సూపర్ స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పుకొచ్చారు. మరి దాన్ని నిజం చేస్తూ అయితే రెండో రోజు సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు చిరు తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి అయితే బాస్ ఈజ్ బ్యాక్ అనే పదానికి నిర్వచనం అని చెప్పడానికి రెండో రోజు నిలకడగా వచ్చిన వసూళ్లే నిదర్శనం అని చెప్పొచ్చు.

Exit mobile version