బాలయ్య, చిరు కాంబినేషన్ పై బోయపాటి కామెంట్స్

బాలయ్య, చిరు కాంబినేషన్ పై బోయపాటి కామెంట్స్

Published on Oct 19, 2024 7:05 AM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఎన్నెన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఒక ఎవర్ గ్రీన్ మల్టీస్టారర్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ ల కలయికే అని చెప్పాలి. వీరిద్దరి బాక్సాఫీస్ యుద్ధం కోసం అభిమానులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల బాలయ్య స్వర్ణోత్సవాల్లో చిరు తమ ఇద్దరినీ పెట్టి సినిమా చెయ్యండి అంటూ యువ దర్శకులూ, బోయపాటి శ్రీనుకి కూడా సవాలు విసిరారు.

అయితే లేటెస్ట్ గా వీరి కాంబినేషన్ పై బోయపాటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ అవార్డు ఈవెంట్ కి హజారైన బోయపాటి ఎదురుగా చిరు బాలయ్యాలని పెట్టుకొని వారికి కథ రాయకపోతే వేస్ట్.. వారిద్దరే తన సినిమాకి టైటిల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. దీనితో ఈ ఊహించని మాస్ కలయికపై ఓ రేంజ్ హైప్ మళ్లీ నెలకొంది. మరి ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో ఈ సెన్సేషనల్ కాంబినేషన్ పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు