ఊరమాస్ కాంబినేషన్ ఈసారి పాన్ ఇండియా లెవెల్లో..?

మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రేజీ అండ్ మాస్ కాంబినేషన్ లలో దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి. బోయపాటి శ్రీను అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సినిమా “సరైనోడు” మాస్ లో ఏ రేంజ్ లో వర్కౌట్ అయ్యిందో తెలిసిందే.

డివైడ్ టాక్ తో స్టార్ట్ అయ్యి అల్లు అర్జున్ కెరీర్ లోనే అప్పటికి హైయెస్ట్ గ్రాస్ అందుకున్న సినిమాగా అది నిలిచింది. ఇక బన్నీని ఊరమాస్ లెవెల్లో బోయపాటి శ్రీను ప్రెజెంట్ చేసిన విధానం అయితే ఫ్యాన్స్ ని కూడా కేజ్రీగా మార్చేసింది. అయితే మళ్ళీ చాలా కాలం నుంచి ఈ కాంబినేషన్ పడుతుంది అనే టాక్ వినిపిస్తూ వస్తుండగా ఇప్పుడు ఆల్ మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయ్యే వరకు వచ్చింది.

లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ సంస్థతో బోయపాటి శ్రీను వర్క్ చేస్తున్నట్టుగా మాసివ్ అప్డేట్ రాగా హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంది. మరి ఇది అల్లు అర్జున్ తోనే అన్నట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version